నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను సభలో ప్రస్తావించండి

Spread the love

అచ్చెన్నాయుడు కోరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ


  నివర్ తుఫాన్ కు  దెబ్బతిన్న అనకాపల్లి నియోజకవర్గంలోని పంటల గురించి శాసన సభలో ప్రస్తావించి, రైతులను త్వరగా నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ కోరారు. పంటలు దెబ్బతిని రోజులు గడుస్తున్నా నేటి వరకు ఒక్క అధికారి కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించక పోవడం దారుణం అని అన్నారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ.25వేల నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు భాద్యతలు స్వీకరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కోట్ని బాలాజీ మర్యాద పూర్వకంగా కలిసి, ఆయనను సత్కరించారు. అచ్చెన్నాయుడు  రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఉత్తారాంధ్రకు బీసీలకు ఇస్తున్న ప్రాముఖ్యత తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో అచ్చెన్నాయుడు  సారథ్యంలో రానున్న స్థానిక ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని బాలాజీ అన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *