
కేంద్ర ప్రభుత్వ ఒంటెద్ధు పోకడకు నిరసనగా రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు ఢిల్లీని విడిచిపెట్టేది లేదని అకుంఠిత దీక్ష చేస్తున్న రైతాంగానికి మద్దతుగా స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో సంఘీభావ దీక్షలు రెండు రోజు
కూడా కొనసాగుతుంది.
చర్చలకు అని పిలిచి రైతు సంఘాలను చీల్చే ప్రయత్నం చేస్తున్న కుటిల రాజకీయాలను మానుకోవాలని దీక్షలో పిలుపునిచ్చారు. ఎన్డీఏ పక్షంలో ఉన్నవారు ఒక్కొక్కరుగా వీడుతూ రైతాంగ ఉధ్యమానికి మద్దుతు తెలియజేస్తుండటం మోడీ మొండి వైఖరికి నిదర్శనమని , ఇప్పటికైనా రైతాంగం పై కక్ష వీడి కార్పొరేట్ శక్తులు కబంధ హస్తాల నుండి బయటకు రావాలని ఏఐకేఎస్ఎస్ జిల్లా నాయకులు బాలకృష్ణ , మల్ల మాధవరావు , పి ఎస్ అజయ్ కుమార్ , కోరిబిల్లి శంకర్రావు , ఐ ఆర్ గంగాధర్ లు హితవు పలికారు. మూడు చట్టాలను రద్దు చేసేంతవరకు ఈ దీక్షలు కొనసాగుతాయని రాష్ట్ర ప్రతినిధి బాలు గాడి తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు యెగ్గాడ భాస్కరరావు , బొడ్డెడ అప్పారావు , బొట్టా చిన్ని యాదవ్ , గంటా శ్రీరామ్ , ఏడువాక దేవుడమ్మ, మెడిశెట్టి సుబ్బారావు , పెంటకోట శ్రీనివాస రావు , ఉమా మహేశ్వరరావు , న్యాయవాది సేకరమంత్రుల సాయి , ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్ తదితరులు పాల్గొన్నారు.