
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న చేదోడు గుర్తింపు కార్డులును పలు వార్డుల్లో లబ్ధిదారులకు అనకాపల్లి జీవీఎంసీ ఎన్నికల ఇన్ చార్జ్ దాడి జైవీర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయవిర్ మాట్లాడుతూ చిరువ్యాపారులను ఆదుకున్న ఘనత జగన్ మోహన్ రెడ్డి దే అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పరిధిలో గల 81 వ వార్డులో ఉన్న పాత 19, 20వ వార్డు , 17, 18 సచివాలయం వాలంటర్. వెల్ఫేర్ సెక్రటరీలు, వార్డు ఇన్ చార్జిలు, 19 వ వార్డు ఇన్ చార్జి పి ఎస్ కె నాయుడు, 20 వ వార్డు ఇన్ చార్జి భీమేష్ , గోపి , 81 వ వార్డు కార్పొరేటర్ కార్పొరేటర్ అభ్యర్థిని పీలా సౌజన్య, రాంబాబు,పీలా రాంబాబు ,పొలమరశెట్టి మురళి,దాడి ఈశ్వరరావు తదితరులుపాల్గొన్నారు