అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ను ప‌రిశీలన

Spread the love
      టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదివారం అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ను ప‌రిశీలించారు. మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో అన్న‌ప్ర‌సాదం స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి తిరుమ‌ల‌కు వ‌స్తున్న భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తుల‌ను ఉన్న‌త‌మైన ప్ర‌మాణాల‌తో అందిస్తున్నామ‌ని వివ‌రించారు. టిటిడి వ‌స‌తుల‌పై భ‌క్తులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న స‌దుపాయాల‌ను ప‌రిశీలించిన‌ట్టు తెలిపారు. వెంగ‌మాంబ అన్న‌ప్రసాదం కాంప్లెక్స్‌లో కోల్డ్ స్టోరేజి, వంట‌శాల‌, భోజ‌న‌శాలను ప‌రిశీలించిన‌ట్టు చెప్పారు. ప‌రిశుభ్ర‌త‌మైన వాతావ‌ర‌ణంలో శుచిగా, రుచిగా అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డిస్తున్నార‌ని, ప‌లువురు భ‌క్తులతో మాట్లాడ‌గా అన్న‌ప్ర‌సాదాలు చాలా బాగున్నాయ‌ని సంతోషం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా అన్న‌దానం అధికారుల‌కు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.   
 అదేవిధంగా, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, దివ్య‌ద‌ర్శ‌నం(కాలిన‌డ‌క భ‌క్తుల కోసం) త‌దిత‌ర కాంప్లెక్సుల‌ను, ప్ర‌వేశమార్గాలను ప‌రిశీలించిన‌ట్టు ఈవో తెలిపారు. భ‌క్తుల కోసం సెల్‌ఫోన్ మ‌రియు ల‌గేజి డిపాజిట్ కౌంట‌ర్లు, కంపార్ట్‌మెంట్ల‌లో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదం, టి, కాఫి, చంటిపిల్ల‌ల‌కు పాలు, ఫోను, వైద్య‌సేవ‌లందించేందుకు డిస్పెన్స‌రీ త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించామ‌న్నారు. 

        ఈ త‌నిఖీల్లో టిటిడి విజివోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజ‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, శ్రీ‌వారి ఆల‌య ఏఈవో శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు, అన్న‌దానం ఏఈవో శ్రీ లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *