20న జరిగే ధర్నాలను జయప్రదం చేయండి : సీపీఐ

Spread the love

అర్హులైన నిరుపేదలకు ఇల్లు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 20 న జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కోడుగంటి .గోవిందరావు భవనంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు వై.ఎన్ .భద్రం, మండల కార్యదర్శి ఆడారి అప్పారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో టిడ్కో ఇల్లును డబ్బులు చెల్లించి న లబ్ధిదారులకు ఇల్లుస్థలాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకుగూడు సమకూర్చేందుకు సీపీఐ ఉద్యమాల ఫలితంగాపాలకులకు కనువిప్పుకలిగిందన్నారు. పట్టణాల్లో కనీసం 2సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3సెంట్లు చొప్పున ఇల్లు స్థలాలను కేటాయించి వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నదన్నారు. టిడ్కో భవనాల వద్ద రోడ్లు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈనెల20న జరిగే ధర్నా లో లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోనలక్ష్మణ, కొరిబిల్లి శంకరరావు, మత్తుర్తి సూరిబాబు తదితరులుపాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *