పాత ప‌నుల‌కు కొత్త మెరుగులు

Spread the love

నాడు నేడు ప‌నుల్లో కొత్త కోణం
పాత‌పునాదుల్లో ఇసుక తీసివేసి కొత్త‌ప‌నుల‌కు ప్యాచ్ ప‌నులు


పాత భ‌వ‌నాల‌కు కొత్తగా రంగులు వేసి కొత్త భ‌వ‌నాలుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అదీ ప్ర‌భుత్వ విప్ బూడి ముత్యాల‌నాయుడు నియోజ‌క‌వ‌ర్గంలోనే చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. దేవ‌రాప‌ల్లి మండ‌లంలోని తెనుగుపూడి క‌స్తూర్బా గాంధీ బాలికా విద్యాల‌యంలో పాత భ‌వ‌నాల‌కు కొత్తగా రంగులు వేసుకుంటున్నారు. నాడు నేడు 1249 ప‌నుల‌కు గాను ప్ర‌భుత్వం రూ.310 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.101 కోట్ల‌తో నేరుగా కేంద్రం నుంచి ఫ‌ర్నీచ‌ర్‌, ఫ్యాన్లు, గ్రీన్‌బోర్డులు, టాయిలెట్స్‌, స్మార్్ట టీవీలు, యూనిఫాం మంజూరు చేస్తుంది. రూ.209 కోట్లు తాగునీటి మోటార్ల‌కు ఎల‌క్ట్రిక‌ల్ ప‌నుల‌కు, మ‌రుగుదొడ్ల‌కు, ప్ర‌హ‌రీలు, మేజ‌ర్‌, మైన‌ర్ మ‌ర‌మ్మ‌తులు ప‌నులకు కేటాయించారు. ఈ ప‌రిణామం మంచిదే అయినా నాడునేడులో చేసేవాటిలో నాణ్య‌త కొర‌వ‌డింద‌ని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వాటిని వాటికి మెరుగులు దిద్ది ల‌క్ష‌లాది రుపాయాలు కాంట్రాక్ట‌ర్ జేబులోకి వేసేసుకుంటున్నార‌ని స్థానికులు చెబుతున్నారు. తెనుగుపుడిలో నాణ్య‌త‌లోపంగా జ‌రుగుతున్న ప‌నుల‌పై సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు డి వెంక‌న్నకు స్థానికులు ఫిర్యాదు చేయ‌డంతో వెంట‌నే ఆ పాఠ‌శాలను ప‌రిశీలించారు. అనంత‌రం వెంక‌న్న విలేక‌ర్లతో మాట్లాడుతూ జిల్లా అంత‌టా ఈ విధంగానే నాడునేడు ప‌నుల్లో అవినీతి చోటుచేసుకుంటుందని ఆయ‌న తెలిపారు. అది నిజ‌మోకాదో తెలియాలంటే మాజీ ఐఏఎస్ అధికారితో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. అనంత‌గిరి మండ‌లంలోని గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాల‌ను పాడేరు ఐటీడీఏ పీవో ప‌రిశీలించి ప‌నుల్లో నాణ్య‌త లోపించిందని అధికారుల‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు. ప్రభుత్వం 159 పనులకు 76 శాతం సెప్టెంబర్ నెల ఆఖరికి పూర్త‌యినట్లు అధికారులు వెల్లడించిన మందకోడిగా పనులు సాగుతున్నాయని ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం అయ్యిఉంటే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడవలసి వచ్చే దని తెలిపారు. 1,159 పాఠశాలలో మరుగుదొడ్లు, 1,092 పాఠశాల‌లో 1,093 ఎలక్ట్రిషన్ 1,128 పాఠశాలలో మెజర్, మైనర్ పనులు జరుగుతున్నాయి. మిగిలిన పాఠశాలలకు రెండో విడతలో నిధులు కేటాయిస్తామని ప్రభుత్వ ఇప్పటికే ప్రకటించిందన్నారు. గతంలో కాంట్రాక్టర్లుల సక్రమంగా పనులు చేయకపోవడం మామ్ముళ్ళు కోసం ఇంజినీరింగ్ అధికారులు చూసిన చూడనట్లు వదలేయడం అతి కొద్దిరోజుల్లోనే ఇప్పుడు చేస్తున్న పనులు అన్ని రీపేరీంగ్ కు వచ్చాయని ఇప్పుడు ఈ ప్రభుత్వం మరల నాటి రీపేరీంగ్ పనులకు కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంద‌ని వెంక‌న్న విమర్శించారు. ఇప్పటి అధికారులు కూడా మామ్ముళ్ళు కు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వ్యవహరించడం అన్ని బాగున్నాయని నివేదిక‌లు ఇవ్వటం అంటే అవినీతిని ప్రోత్సాహించడమేనని ఆయ‌న పేర్కొన్నారు. తెనుగుపూడి గురుకుల పాఠశాలలో కాంట్రాక్టర్లు పాత పునాదుల్లో ఇసుక తీసి కొత్త పనులకు ప్యాచ్ వ‌ర్క్‌లు చేస్తూన్నారని ఇంతక మించిన అవినీతి మరొకటి లేదని అన్నారు. గతప్రభుత్వ నీరు – చెట్టు పేరు చెప్పి అవినీతికి పాల్పుడుతున్నారని నాటి ప్రతిపక్షంలో నాయకులు గుండెలు బాదు కొనేవారని మరిఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వీళ్లు చేస్తున్న పని ఏమిటని వారు ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చేత ద‌ర్యాప్తు జరిపిస్తే నాడు నేడు పనుల్లో అవినీతి బైటపడుతుంతని తెలిపారు. ఐఏఎస్ అధికారితో వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని వెంక‌న్న డిమాండ్ చేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *