ఆ ఉత్త‌ర్వుల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాలి

Spread the love


జివిఎంసి పరిధిలో ఇంటి పన్నులు పెంపుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ పార్టీ జిల్లా నాయకులు భద్రం డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జీవీఎంసీ కార్యాలయంలో సూప‌రింటెండెంట్‌ అప్పలరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ నాయకులు వై ఎన్ భద్రం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొణతాల హరిబాబునాధ్, బీఎస్ పీ పార్టీ నాయకులు సూదికొండ, మాణిక్యాల రావు మాట్లాడుతూ ప్రభుత్వం నగర పట్టణాల సంస్కరణల పేరుతో ప్రస్తుతం అమలులో ఉన్న ఇంటి పన్నులు విధానం కాకుండా మార్కెట్ విలువ ఆధారంగా పన్ను విధించే విధంగా సర్కులర్ జారీ చేసిందని దానివల్ల నగరంలో గల ఇంటి యాజమానలు తమ ఇల్లు కు పన్నులు కట్టుకో లేక అమ్ముకొనే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న పన్నులు కట్టుకోలేక సతమతమవుతూ అప్పులు ఊబిలో చిక్కుకుంటున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఇప్పుడున్న పన్ను కు 20 రెట్లు పైగా పన్ను పెరుగుతుందని దీన్ని భరించలేరని వెంటనే కొత్తగా జారీ చేసిన చేసిన సర్కిల్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో జనాభాకు తగ్గ సిబ్బంది లేక పారిశుధ్యం కొరవడిందని. దోమలు బెడద విపరీతంగా పెరిగిపోయిందని, కొళాయి ద్వారా మురుగు నీరు సరఫరా అవుతున్నందున ప్రజలు రోగాలబారిన పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పట్టణంలో వీధికుక్కలు బెడద తీవ్రంగా ఉందని ఇన్ని సమస్యలతో బాధపడుతున్న ప్రజల పైన అసాధారణంగా పన్నులు పెంచి భారం వేస్తే ప్రజల నుండి ప్రభుత్వాన్ని తిరుగుబాటు తప్పదని వెంటనే పన్నులు పెంచే సర్కులర్ ను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు కొరిబిల్లి శంకర్రావు, బొడ్డేడ వీరు నాయుడు కోన.లక్ష్మణ ,కోరిబిల్లి. జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *