వంద‌కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరించండి

Spread the love

సీఎం జ‌గ‌న్‌ను కోరిన విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌


త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు సహ‌క‌రించాల‌ని కోరుతూ విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని కోరారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎంను మర్యాద పూర్వకంగా గురువారం క‌ల‌సి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. అంగటిదిబ్బ భూ సమస్య అర్హులకు పట్టాల మంజూరు నిమిత్తం – ముస్లింల శ్మ‌శాన వాటికకు వక్ఫ్ బోర్డ్ కు 10 ఎకరాల భూమిని మధురవాడ లో కేటాయించాల‌ని విన్న‌వించారు. 100 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు డీపీర్ సమర్పించారు. రూ.50 కోట్లతో ఇందిరా ప్రియ దర్శిని మునిసిపల్ స్టేడియం పునరుద్ధరించాల‌ని కోరారు. రూ.10 కోట్లతో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి ఆలయం అభివృద్ధి భాగంగా ఆలయాన్ని ఆనుకొని 1ఎకరా భూమి, గోశాల నిమిత్తం సింహాచలం దేవస్థానం నుండి 5ఎకరాల భూమి కేటాయించాల‌ని విన్న‌వించారు. రూ. 7 కోట్లతో 7 దేవాలయాలు పోర్ట్ వెంకటేశ్వర స్వామి, ఇసుక కొండ, జగన్నాథ‌ స్వామి, విగ్నేశ్వర స్వామి, ఎరుకుమాంబ, ఓల్డ్ టౌన్ శివాలయం, కురుపాం మార్కెట్ , 3 సత్రాలు అభివృద్ధి కార్యక్రమాలు అమ‌లకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. హాకర్స్ జోన్ నిమిత్తం రూ.20 కోట్లతో స్టేడియం ఎదురుగా ఉన్న జనతా బజార్ పునరుద్ధరించాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌కు తెలిపారు. రూ. 10కోట్లతో క్వీన్ మేరీ హై స్కూల్ ఆధునికీకరణ ప‌నులు చేప‌ట్టాల‌ని కోరారు. ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానానికి 2ఎకరాల భూమి కేటాయించాల‌ని సీఎంకు విన్న‌వించారు. జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు60 అడుగుల రోడ్డు వెడల్పు చేయాల‌ని దీని కోసం రూ.వంద కోట్లు కేటాయించాల‌ని విన్న‌వించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుప‌ల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి ప‌నుల‌పై చ‌ర్చించినందుకు తగినంత సమయాన్ని కేటాయించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మెయిల్ ద్వారా పంపించమని తెలిపిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ ని ముందుకు తీసుకొని వెళ్లాలని సీఎం సూచించిన‌ట్టు వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ పేర్కొన్నారు.

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించున్న వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *