నీట‌మునుగుతున్న పంట‌లు

Spread the love

అన్నదాతకు తీవ్ర నష్టం

పొంగిపొర్లుతున్న వాగులు
పెరిగిపోతున్న నీటి ఉధృతి

జన్నవరంలో వంతెన నుంచి తాకుతున్న శారద నది వరదల నీరు

అల్ప‌పీడ‌నం కార‌ణంగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. పంట‌ల‌న్నీ నీట‌మునుగిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాల్లోకి నీరు ప్ర‌వ‌హించే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వ‌ర‌ద నీటి ఉధృతి రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. రెండు రోజులుగా ఎడ‌తెర‌పి లేని వ‌ర్షాలే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. భారీ వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌ధాన న‌దులు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. అందులో పెద్దేరు, శార‌ద న‌దులు ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్నాయి. ఆ న‌దుల‌పై నిర్మించిన వంతెన‌లు చాలా వ‌ర‌కూ మునిగిపోయే ద‌శ‌లో ఉన్నాయి. కేవ‌లం అడుగున్న‌ర లేదా రెండ‌డుగుల మాత్రం వంతెన‌లు తేలిఉన్నాయి. వేల ఎక‌రాల్లో పంట నీటి మునిగిపోయింది. ముఖ్యంగా వ‌రి, చెర‌కు రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయే అవకాశం ఉంది. వీటితోపాటు సిరిధాన్యాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. ఎన్ని ఎక‌రాల్లో ఈ పంట‌లు నీట‌మునిగాయ‌న్నది ఇంకా అంచ‌నాకు రాలేదు. ఇంకా ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారుల‌కు నిర్ధిష్ట లెక్క‌లు చేర‌లేదు. గ్రామ రెవెన్యూ అధికారులు పంట‌ల న‌ష్టాన్ని అంచ‌నా వేసే ప‌నిలో ఉన్నారు.
ఏజెన్సీలో ఆగ‌ని వ‌ర్షాలు
విశాఖ ఏజెన్సీలో 11 మండ‌ల‌ల్లోనూ భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. మైదాన ప్రాంతాల‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కాస్త ఎడ‌తెర‌పి ఇచ్చినా ఏజెన్సీలో మాత్రం వ‌ర్షం ఆగ‌లేదు. భారీగా వీస్తున్న గాల‌ల‌కు చాలా చోట్ల చెట్లు నేల‌కూలాయి. కొన్ని చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. దీంతో ప‌లు చోట్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *