ప్ర‌భాస్ చిత్రంలో బిగ్‌బీ

Spread the love

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇటీవ‌ల చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో కీల‌క పాత్ర పోషించారు. తాజాగా మ‌రో తెలుగు చిత్రంలో ఆయ‌న న‌టించి మెప్పించేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ సారి ప్ర‌భాస్ న‌టిస్తోన్న సైంటిఫిక్ చిత్రంలో ఆయ‌న మ‌రో ముఖ్య‌పాత్ర పోషించ‌బోతున్నారు. ఈ సినిమా ప్ర‌భాస్‌కు 21వది కావ‌డం విశేషం. ప్ర‌భాస్ చిత్రంలో అమితాబ్ న‌టిస్తున్న‌ట్టు శుక్ర‌వార‌మే ఆ చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇదే చిత్రంలో దీపికా ప‌దుకొనే క‌థానాయిక‌గా చేయ‌బోతుంది. ఈ చిత్రానికి మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆ సైంటిఫిక్ థ్రిల్లర్‌కు సింగీతం శ్రీ‌నివాస‌రావు స్క్రిప్్ట కు స‌ల‌హాదారుడిగా ఉండ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది చివ‌రిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న ఈ సినిమాను అశ్వ‌నిద‌త్ నిర్మిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *