ఎస్పీ బాలు ఆరోగ్యం విష‌మం

Spread the love

గాన‌గాంధ‌ర్వుడు ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం కరోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. క‌రోనా నుంచి ఇటీవ‌లే కోలుకున్నారు. కానీ తాజాగా ఆయ‌న ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉంది. ఎంజిఎం వైద్యులు కూడా ప్రకటన విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. కరోనా వైరస్ బారిన పడి ఆగస్ట్ 5న చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్న నేపథ్యంలో ఉన్నట్లుండి విషమించిందనే న్యూస్ బయటికి వచ్చింది. బాలు ఆరోగ్యం కొన్ని రోజులుగా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికీ బాలు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఇప్పటికీ ఈయన పరిస్థితి విషమంగానే ఉంది. ఇప్పుడు అది మరింత విషమించిందని తెలుస్తుంది. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు కొన్ని రోజులుగా లైఫ్ సపోర్ట్ అందిస్తున్నారు. అంతేకాకుండా ఎక్మో (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సిస్టమ్‌తో బాలుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అంటే పేషెంట్ గుండె, ఊపిరితిత్తులకు అదనపు మద్దతు అందించడం అన్నమాట. అలా బాలుకు చికిత్స చేస్తున్నారు. హార్ట్ అండ్ లంగ్స్ బైపాస్ కింద పని చేస్తుందన్నమాట ఇది. కృత్రిమ ఊపితిత్తుల ద్వారా రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. విదేశీ వైద్యులు ఈయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఊపిరితిత్తులలోకి వెంటిలేటర్ ఆక్సీజన్ నిండిన గాలిని పంపిస్తే.. ఈసీఎంఓ పంప్స్ రక్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సీజన్ నింపిన రక్తాన్ని అందిస్తున్నారు. దానివల్ల పేషెంట్ శరీరం చికిత్సకు స్పందించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పద్ధ‌తినే బాలు కోసం వాడుతున్నారు వైద్యులు. ఇదంతా చూస్తుంటే బాలు పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని అర్థమవుతుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *