కోవిడ్ పరీక్షల కోసం వచ్చిన ప్రతిఒక్కరికీ టెస్టులు చేయాల్సిందే

Spread the love


కోవిడ్-19 పరీక్షలపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు


దేశ వ్యాప్తంగా పలు కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కోవిడ్-19 పరీక్షలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరెవరికి పరీక్షలు చేయాలో మార్గదర్శకాల్లో తెలిపింది. కోవిడ్ పరీక్షల కోసం వచ్చిన ప్రతిఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించింది. ముఖ్యంగా కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో ఉండే ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించాలని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల్లోనూ తప్పనిసరిగా పరీక్షలు జరపాలని సూచించింది. అదే సమయంలో కోవిడ్ టెస్టుల్లో మొదటి ప్రాధాన్యతగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు, ఆ తర్వాత ఆర్టీ-పీసీఆర్‌ లేదా ట్రూనాట్‌ లేదా సీబీనాట్‌ టెస్టులు ఉండాలని ఐసీఎంఆర్ తన కొత్త మార్గదర్శకాల్లో తెలిపింది.
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఇవే…
కంటైన్‌మెంట్‌ జోన్లలో సాధారణ నిఘా, స్క్రీనింగ్ పాయింట్ల వద్ద ప్రవేశానికి:
వైద్య, ఆరోగ్య సిబ్బంది సహా ఇతర అత్యవసర సేవలు అందించే వారిలో ఎటువంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు నిర్వహించాలి. వారి కుటుంబ సభ్యులు సహా వారితో నేరుగా కలిసి లక్షణాలు లేని వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలి.
నేరుగా, అధిక ప్రమాదం ఉన్న కాంటాక్ట్ కేసులు (కుటుంబం, ఆఫీసులలో అనారోగ్య లక్షణాలున్న వారికి, వృద్ధులకు 5వ రోజు 10వ రోజు మధ్య పరీక్షలు చేయాలి.
కంటైన్‌మెంట్‌ జోన్లలో వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సహా వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారందరికీ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి.

కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో:
ముఖ్యంగా కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో ఉండే ప్రతిఒక్కరికీ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించాలని.. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల్లో తప్పనిసరిగా ఈ పరీక్షలు జరపాలని సూచించింది.
నాన్ కంటైన్‌మెంట్‌ జోన్లలో సాధారణ నిఘా:
గత 14 రోజుల్లో విదేశీ ప్రయాణాలు చేసిన వ్యక్తులందరికీ పరీక్షలు నిర్వహించాలి.
ల్యాబొరేటరీల్లో ధృవీకరించిన కేసులతో పరిచయాలున్న వ్యక్తులందరికీ పరీక్షలు చేయాలి
కంటైన్మెంట్ జోన్లు ఉపశమన కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పరీక్షలు తప్పనిసరిగా చేయాలి.
7 రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన అనారోగ్య లక్షణాలతో ఉన్న వారందరికీ పరీక్షలు తప్పనిసరి.
ముఖ్యంగా ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా (ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలుకు ప్రాధాన్యత) పరీక్షలు నిర్వహించాలి.
హాస్పిటల్స్ సెట్టింగ్స్:
సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌తో(SARI) బాధపడుతున్న రోగులకు పరీక్షలు నిర్వహించాలి.
ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో విధులకు హాజరువుతున్న వారిందరికీ
అత్యవసర వైద్యం అవసరమున్నవారు ట్రాన్స్ ప్లాంట్ పేషెంట్లు, క్రానిక్ కోమార్బిట్స్ లక్షణాలు ఉండేవారికి పరీక్షలు చేయాలి.
లక్షణాలు లేకున్నా శస్త్ర చికిత్సలకు వెళ్లే ప్రతిఒక్కరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఆస్పత్రిలో ఉన్నంత కాలం వారంలో ఒకసారికి మించకుండా టెస్టులు చేయాలి.
ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ప్రతిఒక్కరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి.
గమనించవలసిన అంశాలు:
గర్బిణుల ప్రసవం వంటి అత్యవసర పరిస్థితుల్లో.. కొవిడ్‌-19 నెగటివ్‌ ధ్రువపత్రం లేదనే కారణంగా చికిత్సను నిరాకరించరాదు. ఆలస్యం చేయరాదు.
కోవిడ్ పరీక్ష చేయడానికి అవసరమైన శాంపిల్స్ ను తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి.
పాజిటివ్‌గా నిర్ధారణ అయిన చంటి పిల్లల తల్లులు.. బిడ్డ దగ్గరకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రపరచుకోవాలి. చిన్న పిల్లల్లో ఏమాత్రం లక్షణాలున్నా, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా పరీక్షలు జరపాలి.
డిమాండ్ ను బట్టి కోవిడ్ టెస్టులు:
దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరినీ కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చాకే అనుమతించాలని రాష్ట్రాలకు సూచించింది. ఎంట్రీ పాయింట్లలోనే ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరింది.
ఇకపై కరోనా టెస్టులను బాధితులు కోరిన వెంటనే నిర్వహించేలా పరీక్షల నిర్వహణలో మార్పులు చేయాలని రాష్ట్రాలకు ఐసీఎంఆర్‌ సూచనలు చేసింది.

కోవిడ్ పరీక్షల యొక్క ఫ్రీక్వెన్సీ:
ఆర్టీపీసీఆర్/ ట్రునాట్ / సిబినాట్ / ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లలో ఒకసారి పాజిటివ్ వస్తే దాన్ని కన్ఫర్మేటివ్ పాజటివ్ కేసుగా గుర్తించాలి. మరోసారి పరీక్ష చేయాల్సిన అసవరం లేదు.
కోవిడ్ పాజిటివ్ వచ్చి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యే సమయంలో మరోసారి కోవిడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. (కోవిడ్ ఏరియా / నాన్ కోవిడ్ ఏరియా సదుపాయాలున్న చోటకు మార్చేటప్పుడు)
ఒకవేళ వేళ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మరోసారి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే అప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లేదా ఆర్టి-పిసిఆర్ టెస్ట్ కానీ చేయాలి.
గమనించవలసిన అంశాలు:
అనుమానిత, పాటిజిట్ వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్ అవుతున్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు తప్పనిసరిగా వారికి తగిన పీపీఈ కిట్ ధరించాలి.
ఎటువంటి శస్త్రచికిత్స చేయించుకునేవాళ్లయినా 14 రోజుల ముందు నుంచే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. తద్వారా వైరస్‌ సోకే ముప్పును తగ్గించుకోవాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *