మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ క‌న్నుమూత‌

Spread the love

మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తుది శ్వాస విడిచారు. ఈనెల 10న మధ్యాహ్నం ఆస్పత్రిలో ప్రణబ్ చేశారు. ప్రణబ్ మెదడులో కణితి ఏర్పడటంతో శస్త్రచికిత్స వైద్యులు శ‌స్త్ర చికిత్స చేశారు. కానీ ఈలోగా ఆయ‌న‌కు క‌రోనా సోకింది. చికిత్స పొందుతూనే ఆయ‌న మ‌ర‌ణించారు. స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్న కె.కె.ముఖర్జీకి ఈయ‌న 1935 డిసెంబర్‌ 11న బంగాల్‌లోని మిరాఠీలో జ‌న్మించారు. కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు. 1957 జులై 13న సువ్రా ముఖర్జీని వివాహమాడారు. 2015లో అనారోగ్యంతో ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ క‌న్నుమూశారు.
క్లర్క్‌ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు సాగిన ప్రణబ్ ప్రస్థానం

రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ మొదట క్లర్క్‌గా, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా ప‌ని చేశారు. దెషర్ దక్ పత్రికకు పాత్రికేయులుగానూ పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అలంకరించారు. 1969లో ఇందిరాగాంధీ హయాంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 34 ఏళ్లకే పెద్దల సభలో అడుగుపెట్టారు. 1973లో ఇందిరాగాంధీ హయాంలో తొలిసారి మంత్రివర్గంలో ప్రణబ్‌కు చోటు ద‌క్కింది. పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా విధులు నిర్వహించారు. 1975-77లో అంతర్గత అత్యవసర పరిస్థితిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1982లో 47 ఏళ్ల వయసులోనే కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించిన వ్య‌క్తి ఈయ‌న‌. 1982 నుంచి 1984 వరకు ఆర్థికమంత్రిగా కొనసాగారు. 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు కూడా. రాజీవ్‌గాంధీ సూచనతో ఆర్‌ఎస్‌సీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991 నుంచి 96 వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. 1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేలా సోనియాను ప్రోత్సహించిన వ్య‌క్తి ఈయ‌న‌. కాంగ్రెస్ క్లిష్ట సమయాల్లో మార్గనిర్దేశం చేసిన నేత ప్ర‌ణ‌బ్‌. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఎన్నో సమస్యలు పరిష్కరించారు. గాంధేయవాదిగా, కరడుకట్టిన కాంగ్రెస్‌ వాదిగా మచ్చలేని నేతగా పేరుపొందారు. యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు రక్షణ మంత్రిగా ప‌ని చేశారు. 2006 నుంచి 2009 వరకు విదేశీ వ్యవహరాల మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. 2009 నుంచి 2012 వరకు ఆర్థికమంత్రిగా సేవ‌లందించారు. కాంగ్రెస్‌లో వివాద పరిష్కర్తగా పేరు గడించారు. 2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేప‌ట్టారు. 2017 వరకు రాష్ట్రపతి పదవిలో కొనసాగారు. 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు.
ప‌లువురి సంతాపం
ప్ర‌ణ‌బ్ మృతికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి, రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమితాషా, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు త‌దిత‌రులంతా తమ సంతాపం తెలిపారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *