మందుపాత‌ర పేలి ఇద్ద‌రు గిరిజ‌నుల మృతి

Spread the love


మందుపాత‌ర పేలి సోమ‌వారం ఇద్ద‌రు గిరిజ‌నులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న విశాఖ ఏజెన్సీలోని పెద‌బ‌య‌లు మండ‌లం కొండ్రు స‌మీపంలో చోటుచేసుకుంది. మృతులు మొండిప‌ల్లి మోహ‌న్‌రావు(20), మొండిప‌ల్లి అజ‌య్‌కుమార్ (20)గా పోలీసులు గుర్తించారు. మృతులు స్వ‌స్థ‌లం పెద‌బ‌య‌లు మండ‌లం చింత‌ల‌వీధి గ్రామం. ప‌శువులు క‌నిపించ‌డం లేద‌ని అట‌వీ ప్రాంతం వైపు ఈ ఇద్ద‌రు వెళ్లారు. ఈ క్ర‌మంలో మందుపాత‌ర‌పై వారు కాలు మోప‌డంతో అది పేలిపోయింది. దీంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. పోలీసులే ల‌క్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాత‌ర‌ను అమ‌ర్చిన‌ట్టు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *