రుచిక‌ర‌మైన బిర్యానీ దొర‌క లేద‌ని రెస్టారెంటే పెట్టేశాడు

Spread the love
చింత‌ప‌ల్లిలో స్కై బిర్యానీ


ఎవ‌రికైనా ఏదైనా కావాలంటే ఎక్క‌డుందో వెతుక్కుంటాం. ఒక వేళ దొరికినా అది న‌చ్చ‌క‌పోతే మ‌రో చోట‌కు వెళ్లి కొనుక్కుంటాం. దాని కోసం షాపు పెట్టేయం క‌దా… కానీ ఓ వ్య‌క్తి త‌న స్నేహితుడు ఓ ప్రాంతానికి వ‌చ్చిన‌ప్పుడు బిర్యానీ కోసం తెగ వెతికాడ‌ట‌. ఆన్ లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తే ఎవ‌రైనా బిర్యానీ తెస్తారా? అని చూశాడట. కానీ అదీ లేదు. ఈ విష‌యాన్ని త‌న స్నేహితుడితో చ‌ర్చించారు. అక్క‌డే రెస్టారెంట్ పెట్టి బిర్యానీ రుచుల‌ను ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. అత‌నే నాగ‌రాజు..చింత‌ప‌ల్లిలోని స్కై రెస్టారెంట్ య‌జ‌మాని. వైజాగ్‌కు చెందిన త‌‌న స్నేహితుడు మ‌న్యం అందాల‌ను చూడ్డానికి వచ్చారు. అందులో భాగంగా ఇక్క‌డ స‌మీపంలో ఉన్న ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థానం చూద్దామ‌ని వ‌చ్చారు. అప్పుడు స‌మ‌యం మ‌ధ్యాహ్నం ఒంటిగంట అ‌యింది. ఆక‌లి మొద‌లైంది. రుచిక‌ర‌మైన బిర్యానీ కోసం చింత‌ప‌ల్లి మొత్తం తిరిగారు. కానీ ఎక్క‌డా తాను అనుకున్న బిర్యానీ దొర‌క‌లేదు. క‌నీసం ఆన్‌లైన్‌లో అయినా ఎవ‌రైనా బిర్యానీ తెస్తారా? అని చూశారు. కానీ అలా కూడా త‌న‌కు కావాల్సింది దొర‌క‌లేదు. ఈ విష‌యం నాగ‌రాజుతో చ‌ర్చించారు. ఇక అంతే…ఇక్క‌డ బిర్యానీ ప్రియులకు త‌గ్గ‌ట్టు రెస్టారెంట్ ప్రారంభించేశారు. త‌న స్నేహితుడు చెప్పిన‌ట్టే, చింత‌ప‌ల్లి ప‌రిస‌ర వాసుల‌కే కాకుండా దేశ విదేశాల నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కుల అభిరుచుల‌కు ఎక్క‌డా త‌గ్గ‌కుండా అందించాల‌నుకున్నారు. అందుకే ప‌ట్ట‌ణంలో పేరుగాంచిన రెస్టారెంట్ల‌లో అనుభ‌వం ఉన్న చెఫ్‌ల‌తో త‌న రెస్టారెంట్ ప్రారంభించారు. కానీ ఎస్. ఎం. ఎస్ చేస్తే ప‌ది నిమిషాల్లో బిర్యానీ డెలీవ‌రీ చేస్తామ‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌పై పెద్ద ఎత్తునే చ‌ర్చ జ‌రిగింది. అలా చేయ‌డం సాధ్యం కాద‌నో… ఆ బిర్యానీ ఇక్క‌డెవ‌రు కొంటార‌నో..ఇలా అనేక‌ కామెంట్లు వ‌చ్చాయి. అదొక హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే చింత‌ప‌ల్లిలో ఇప్ప‌టి వ‌ర‌కూ డోర్ డెలీవ‌రీ అనేది లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. ఎవ‌రు ఏమ‌నుక‌న్నా స‌రే నాగ‌రాజు అనుకున్న‌ట్టే క్వాలిటీ బిర్యానీ అందించారు. ఎస్. ఎం. ఎస్ గానీ, ఫోన్ గానీ చేసిన వారికి ప‌ది నిమిషాల్లోనే డోలీ డెలీవ‌రీ చేశారు. ఆ…చూద్దాం ఇలా ఎంత కాలం చేస్తారో అని మూతులు కొరుక్కున్నారు. ఈ సేవ‌లు రెండు నెల‌లు నిరంత‌రాయంగా అందించారు. అంతే.. చింత‌ప‌ల్లికి కొత్త ట్రెండ్ ప‌రిచ‌యం చేశారు. గుసుగుస‌లాడుకున్నవారే మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తి క‌స్ట‌మ‌ర్‌నూ తొలి క‌స్ట‌మ‌ర్‌గానే భావిస్తూ సేవ‌లందిస్తున్నా అంటున్నారు నాగ‌రాజు.

చింత‌ప‌ల్లి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ గురించి వివ‌రిస్తున్న నాగ‌రాజు
రెస్టారెంట్ లోప‌ల
రెస్టారెంట్ లోప‌ల

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *