త్వ‌ర‌లో చింత‌ప‌ల్లి ఆర్గానిక్ బాస్మ‌‌తి రైస్‌

Spread the love

చింత‌ప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థానం ఎన్నో విజ‌య‌వంత‌మైన ప్ర‌యోగాలు చేసింది. త్వ‌ర‌లో మ‌రో మైలు రాయిని చేరుకోబోతుంది. అదే సేంద్రీయ ప‌ద్ద‌తులో ప్ర‌యోగాత్మ‌కంగా పండించిన బాస్మ‌తి బియ్యం. ఎక‌రాకు 18 క్వింటాలు దిగుబ‌డిని రాబ‌ట్టింది. త్వ‌ర‌లోనే చింత‌ప‌ల్లి బ్రాండ్‌తో ఆర్గానిక్ బాస్మ‌తి రైస్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. దీనికి ప్ర‌భుత్వం కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప‌రిశోధ‌న స్ధానంలో 10 మంది వ్య‌వ‌సాయ శాస్త్రవేత్తలు వివిధ వంగ‌డాల‌పై ప‌రిశోధ‌న చేస్తూ విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, విశాఖ‌ప‌ట్నం ప‌ర్వ‌త ప్రాంతాల్లో ఉండే గిరిజ‌నుల‌కు నిత్యం సూచ‌న‌లు చేస్తున్నారు. సంప్ర‌దాయ పంట‌లైన మొక్క‌జొన్న‌, రాజ్‌మాలు, వ‌లిసెలు, వ‌రి వంటి పంట‌లే కాకుండా ప్ర‌త్యా‌మ్నాయ పంట‌లు గిరిజ‌న ప్రాంతాల‌కు ఎంత‌వ‌ర‌కూ అనుకూలం అన్న‌దానిపై వీళ్లు ప్ర‌యోగాలు చేస్తున్నారు.

చింత‌ప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థానం రాష్ట్రంలోనే అతి పెద్ద‌ది. ఇంత‌కు ముందు ఉత్త‌రాంధ్ర జిల్లాలు విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం గిరిజ‌న ప్ర‌జ‌ల‌కే కాకుండా ఖమ్మంలోని ట్రైబ‌ల్స్‌కు కూడా ఇక్క‌డ నుంచే సేవ‌లందేవి. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు మాత్ర‌మే సేవ‌లందిస్తోంది. ఈ ప‌రిశోధ‌న కేంద్రం విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల్లో ఉన్న ప‌రిశోధ‌న కేంద్రాలు అనుబంధంగా ప‌ని చేస్తుంటాయి. ఈ ఇనిస్టిస్ట్యూట్‌లో ఎటువంటి ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. రైతుల‌కు అందిస్తున్న సేవ‌లేమిట‌న్న‌దానిపై శాస్త్రవేత్త, ప‌రిశోధ‌న స‌హాయ‌క డైరెక్ట‌ర్ డాక్ట‌ర్‌ గుత్తా రామారావును మీ MLA న్యూస్ పోర్ట‌ల్ ప్ర‌తినిధితో పంచుకున్నారు. ఆచార్య ఎన్ జీ రంగా విశ్వ‌విద్యాల‌యం వారు మ‌న రాష్ట్రాన్ని నేల స్వ‌భావం, వాతావ‌ర‌ణ ప‌రిస్థ‌తుల‌న బ‌ట్టి ఆరు మండ‌లాలుగా విభ‌జించారు. అవి ఎత్తైన ప‌ర్వ‌త శ్రేణి గిరిజ‌న మండ‌లం..దీనికి కేంద్రం చింత‌ప‌ల్లి, ఉత్తర‌‌కోస్తా మండ‌లం దీనికి కేంద్రం అన‌కాప‌ల్లి. గోదావ‌రి మండ‌లం హెడ్‌క్వార్ట‌ర్ మార్టేరు. కృష్ణ మండ‌లానికి కేంద్రం గుంటూరు. ద‌క్షిణ మండ‌లానికి తిరుప‌తి కేంద్రం. త‌క్కువ వ‌ర్షం పాతం ఉన్న రాయ‌ల‌సీమ మండ‌లానికి నంద్యాల కేంద్రంగా విభ‌జించారు. చింత‌ప‌ల్లి ప్రాంతీయ ప‌రిశోధ‌న స్థానం ఎత్తైన‌ ప‌ర్వ‌త శ్రేణి అయిన‌ విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, విశాఖ జిల్లాలో విస్త‌రించింది. ఈ మూడు జిల్లాలో గిరిజినుల‌కు ఇవి సేవ‌లందిస్తున్నాయి. ఈ మూడింటికి చింత‌ప‌ల్లి కేంద్రంగా ఉంది. విశాఖ‌లో 11, విజ‌య‌న‌గ‌రం8, శ్రీ‌కాకుళం 7 జిల్లాలకు ఈ గిరిజ‌న మండ‌లం విస్త‌రించింది. దీనిని 1985లో స్థాపించారు. ఈ మూడు జిల్లాల్లో ఉన్న గిరిజ‌నుల‌కు వ్య‌వసాయంలో ప‌రిశోధ‌న‌ల నిమిత్తం దీన్ని ఇక్క‌డ స్థాపించారు.
ప‌రిశోధ‌న సంస్థ ల‌క్ష్యాలు

చింత‌ప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థానం స‌హాయ‌క డైరెక్ట‌ర్ డాక్ట‌ర్‌ గుత్తా రామారావు


ఈ మూడు జిల్లాల్లో ఉన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఎటువంటి పంట‌లు సాగు చేస్తే బాగుంటుంద‌న్న‌దానిపై ప్ర‌యోగాలు చేసి వాటిని ఎంపిక చేస్తాం.అందులోనూ అధిక దిగుబ‌డి ఇచ్చే పంట‌ల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెడ‌తాం. గిరిజ‌న ప్రాంతంలో ప్ర‌ధానంగా వ‌లిసెలు, రాజ్‌మా చిక్కులు అనే పంట‌లు ఇక్క‌డే పండుతాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎక్క‌డా ఇవి పండ‌వు. వీటిపై కూడా ఎక్క‌డా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గ‌డం లేదు. సంప్ర‌దాయ ప‌ద్ధతుల్లో సేద్యానికి, శాస్ర్తీయ ప‌ద్ధతుల్లో సాగుకు చాలా తేడా ఉంది. రైతాంగానికి స‌రిప‌డే వివిధ సేద్య‌పు ప‌ద్ధ‌తుల‌ను క‌నుగొని వారికి సూచ‌న‌లు చేస్తాం. మిశ్ర‌మ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను, సేంద్రీయ వ్య‌వ‌సాయంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌డం. సంప్ర‌దాయేతర పంట‌లు గోధుమ‌, పొద్దు తిరుగుడు పంట‌లు ఇక్క‌డు పండించొచ్చా ? లేదా? అన్న‌దానిపై ప్ర‌త్యేకంగా దృష్టి పెడ‌తాం. ఆ పంట‌ల‌ను ఇక్క‌డ రైతులు పండించేలా సూచ‌న‌లు చేస్తాం. అందుకే ఆ రెండు పంట‌ల‌పై ఇక్క‌డ ఎక్కుగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. గిరిజ‌న రైతాంగానికి అనుకూల‌మైన సేద్య‌పు ప‌ద్ధతుల‌ను కొనుగొని వారి సాగుకు ఎంత‌గానో స‌హ‌కారం అందిస్తున్నాం.


చింత‌ప‌ల్లి జి. రామారావు చింత‌ప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థానం స‌హాయ‌క డైరెక్ట‌ర్ డాక్ట‌ర్‌ గుత్తా రామారావు మీ MLA ప్ర‌తినిధితో పంచుకున్న విష‌యాలు


గిరిజ‌న ప్రాంతంలో రైతుల‌కు మంచి విత్త‌నాలు అందించ‌డం కూడా ప్ర‌ధాన ల‌క్ష్యం. ఇక్కడ వ‌రి ప్ర‌ధాన‌మైన పంట. వ‌రిలో ముఖ్యంగా ఎంటీయూ మంజూరు 1075, ఎంటీయూ 1156, ఆర్‌జీఎల్ 2537 ఈ మూడు ర‌కాల విత్త‌నాల‌ను ఈ ప‌రిశోధ‌న సంస్థ ద్వారా రైతుల‌కు అందిస్తున్నాం. వ‌రితోపాటు రాగులు, అందులో చైత‌న్య రాగులు, కొర్ర‌ల్లో సూర్య‌నంది, వ‌లిసెల్లో జెఎన్ఎస్ 06, జెఎన్ఎస్ 28, జె ఎన్ ఎస్ 30 వంటి విత్త‌నాల‌ను త‌యారు చేసి మేం రైతుల‌కు అందిస్తున్నాం. రాజ్‌మాలు ఇక్క‌డ 10వేల ఎక‌రాల్లో సాగు అవుతుంది. రాజ్‌మాల్ ఉత్త‌ర భార‌త‌దేశ‌ పంట‌. అంబ‌రు, ఉత్కంఠ‌, అరుణ్ అనే మూడు ర‌కాల పంట‌ల‌ను కాన్ఫూర్ నుంచి తెప్పించి ఇక్క‌డ ప్ర‌యోగం చేశాం. ఇక్క‌డ వాతావ‌రణానికి అవి కూడా పండుతాయ‌ని తేలింది. వాటిని రైతుల‌కు ఇస్తున్నాం. ఇవి ముఖ్య‌మైన మ‌న విత్త‌నోత్ప‌త్తికి చెందిన‌వి.
వ‌లిసెల ప‌రిశోధ‌న స‌మ‌న్వ‌య సంస్థ‌

వ‌లిసెల పంట‌


భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న మండ‌లి, భార‌త నూనె గింజ‌ల ప‌రిశోధ‌న సంస్థ హైద‌రాబాద్‌ స‌హ‌కారంతో అకిల భార‌త వ‌లిసెల ప‌రిశోధ‌న స‌మ‌న్వ‌య‌ సంస్థ‌ను చింత‌ప‌ల్లి ఇచ్చారు. మ‌న రాష్ర్టంలో ఇక్క‌డే ఉంది. వ‌లిసెల్లో అధిక దిగుబ‌డినిచ్చే వంగ‌డాల‌ను ఇక్క‌డ త‌యారు చేయ‌డ‌మే ల‌క్ష్యం. ఈ సంస్థ‌ను 2018లో ఇక్క‌డ ప్రారంభించారు. దీని కోసం ప్ర‌త్యేకంగా ఓ శాస్త్రవేత్త‌ను నియ‌మించారు.
10 మంది శాస్త్రవేత్త‌ల సేవ‌లు

చింత‌ప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థానంలో ప్ర‌యోగానికి సాగు చేస్తున్న మొక్క జొన్న
చింత‌ప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థానంలో ప్ర‌యోగానికి సాగు చేస్తున్న మొక్క జొన్న


గిరిజ‌నుల‌కు సేవ‌లందించేందుకు ఈ ప‌రిశోధ‌న స్థానంలో మొత్తం 10 మంది శాస్త్రవేత్త‌లు ఉన్నారు. 38 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కొక్క‌రూ ఒక్కో పంట‌పై ప‌రిశోధ‌న చేస్తారు. మొక్క‌జొన్న‌లు, రాగులు, వ‌లిసెలు…ర‌క‌ర‌కాల పంట‌ల‌పై ఈ శాస్త్రవేత్త‌లంతా అధ్య‌య‌నం చేస్తారు. ఇవి కాకుండా గోధుమ‌, అవిసెలు(నార్్త ఇండియా ముఖ్య‌మైన పంట‌), సెన‌గ‌లు, పొద్దు తిరుగుడు పంట‌ల‌పై ఇప్పుడు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఇవి ఇక్కడ వాతావ‌ర‌ణానికి అనుకూల‌మా? కాదా? అన్న‌ది చూస్తున్నారు.
మూడు పద్ధ‌తుల్లో ప‌రిశోధ‌న‌లు

చింత‌ప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న స్థానంలో ఉన్న విత్త‌న గోదాములు


వ్య‌వ‌సాయ విశ్వ విద్యాల‌యం, వ్య‌వ‌సాయ శాఖ, ఎన్‌జీవో పాలేక‌రు సేంద్రీయ వ్య‌వ‌సాయ ప‌ద్ధతులు ఇలా మూడు ర‌కాలుగా చేప‌డుతున్న పంట‌ల‌పై ప‌రిశోధన‌లు చేస్తున్నారు. ఈ ప‌ద్ధ‌తిలో ఇక్క‌డ ప‌రిస్థితులు అనుకూల‌మో చూస్తాం. ఈ మూడు పద్ధ‌తుల్లో తేడాలున్నాయా? లేదా? అన్న‌ది ప‌రిశోధ‌న చేస్తున్నాం. మొద‌ట ఒక పంట వేసి అది తీసేసిన వెంట‌నే మ‌రో పంట వేస్తే ఎలా ఉంటుంద‌న్న‌దానిపై ప్ర‌యోగాలు జ‌రుపుతున్నారు.

Recommended For You

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *