కుమ్మరి చక్రం.. కనుమరుగాయే

Spread the love
కుమ్మరి కార్తీక్ బాబు


సాంకేతిక పరిజ్ఞానం తో దూసుకుపోతున్న ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో రకాల చేతివృత్తులు మరుగున పడుతున్నాయి. జీవనాధారం గా ఉండే ఆ చేతి కళే, వారి ఆకలిని తీర్చలేక పోతుంది. బ్రతుకు బండిని లాగే క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవలసి వస్తోంది. ఇక మారుమూల గ్రామాల్లో బ్రతికే ఆదివాసీల పరిస్థితి, మరీ దయనీయంగా మారింది. ప్రస్తుతం వారి జీవన విధానం ఎలా సాగుతుందో మనము చూసొద్దాం రండి.

కొర్ర పద్మమ్మ

కుండను మలిచే _ చక్రం ఆగే
అది విశాఖ జిల్లా చింతపల్లి మండలం ఏ అన్నవరం గ్రామం లో వందల సంఖ్యలో జీవించే ఒక చిన్న కుమ్మరిగూడెం.
తాత ముత్తాతల నుంచి కుమ్మరి వృత్తినే నమ్ముకొని బ్రతికే కుటుంబాల వి. మట్టి తల్లినే నమ్ముకొని, అదే వారికి కూడు పెడుతుందని నమ్మే కల్మషం లేని మనసులు వారు. ఒకప్పుడు కేవలం ఈ కుండల తయారీ వల్ల వచ్చే ఆదాయంతోనే ఇంటిల్లపాది సంతృప్తిగా, ఆనందంగా ఉండేవారు. మనిషి జీవన శైలి లో అనేక మార్పులు ఏర్పడ్డాయి. ఇక వీటి అవసరం ఎవరికీ లేకపోయింది. వారమంతా కష్టపడి చేసిన వస్తువులు ఏ మాత్రము చెల్లుబాటు కాని పరిస్థితి .మరి మట్టితో కుండలుగా, అందమైన గుర్రపు బొమ్మలుగా, పూల కుండీలు గా మలిచే ఆ కుమ్మరి చక్రం వేగం తగ్గిపోయింది. పనికిరాని వస్తువుగా ఇంటిలో ఓ మూలన పడి ఉంది.మరి ఆ చక్రం లేని వారి జీవన బండి ముందుకు సాగేదెలా…
ఇది ఏ ఒక్క కుటుంబానికి మాత్రమే చెందిన గాధ కాదు. ఆ గూడెం లో నివసించే వందల కుటుంబాలకు ఇదే ఆధారం. ఆ పరిస్థితిని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

కుమ్మరి గోపన్న

తిండికి ఇబ్బంది లేకపోయేది

“మా అయ్య దగ్గరనుంచి ఈ పని నేర్చుకుంతిని. చిన్నతనంలోనే అయ్య చేసిన కుండలను సంతకు మోసుకొని పోయే వాళ్ళం. సక్కని డబ్బులు వచ్చేటివి. తిండికి ఇబ్బంది లేకపోయేది. ఇప్పుడు ఏందో సెల్లు బాటే లేకపోయే. అందుకే ఇంటి పక్కనే ఉన్న కొంచెం జాగాలో కూరగాయలు పండించి, సంతలో అమ్మి ఏదో అలా పబ్బం గడుపుకుంటున్నాం.మాది పెద్ద కుటుంబం. కొడుకు కార్తీక్ బాబుకి కూడా ఇదే పని నేర్పించాను. ఆదాయం లేని ఈ వృత్తినే నమ్ముకొని ఎన్నాళ్ళు బ్రతకగలం.అసలు ప్రభుత్వానికి ఎలా అర్జీ పెట్టుకోవాలో కూడా మాకు తెలియదు. మీరే ఏదైనా సాయం చేయాలి.” అని కుమ్మరి గోపన్న “మీ ఎమ్మెల్యే “ప్రతినిధులతో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఒక్క గోపన్న కుటుంబానికే కాదు ఆ గూడెం లో నివసించే ఎన్నో కుటుంబాలకు కనీసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి తెలియదు.

సాయం కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు రాధమ్మ కుటుంబం

Recommended For You

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *