రాజకీయ నాయకులు జన్మదిన వేడుకలు లాగా రౌడీషీటర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అనకాపల్లి మామిడి పాలెం శివారు సరుగుడు తోటల్లో పేరు మోసిన రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఈ వేడుకలకు 30 మంది బడా చోటా మోటా రౌడీషీటర్ల్ హాజరయ్యారు. గ్రామ శివార్లలోని తోటల్లో మద్యంతో విందు వినోదాలతో హల్ చల్ చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావుకు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారరు. ఈ విషయాన్ని పసిగట్టిన రౌడీ షీటర్లు అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు నుండే సమాచారం లీక్ అయ్యిందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం గాజువాకలో బౌన్సర్లతో హోటల్లో రౌడీషీటర్ చిట్టిమాము జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఆఫిసర్లు చేసిన దాడుల్లో పలువురు అరెస్ట్ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ఇటీవలే పోలీసులు రౌడీ మేళ నిర్వహించారు. రౌడీమూకలు పార్టీ పై పోలీసులు విచారణ చేస్తున్నారు.