విశాఖ జిల్లాలో పోలీసులు నిర్వహించిన వేర్వేరు తనిఖీల్లో 572 కిలోల గంజాయి పట్టుబడింది. చోడవరం మండలంలో నిర్వహించిన సోదాల్లో 286 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందులో గౌరీపట్నం కూడలి వద్ద 168 గంజాయిని పట్టుకున్నారు. వెంకన్నపాలెంలో 118 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ ఘటనలో పాడేరు మండలం పిండ్రంగి గ్రామానికి చెందిన బొర్రా చంద్రారావును వాహనంతో పాటుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వెంకన్నపాలెం కూడలి వద్ద బొలోరా వాహనంలో తరిలిస్తున్న 118 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన జి.తునాయిక్ ను అదుపులోకి తీసుకుని, నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ ఈశ్వరరావు వివరించారు.