
గత ప్రభుత్వం అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికుల ను చిన్నచూపు చూస్తుందని ఆంధ్రప్రదేశ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (ఎఐటియుసి) రాష్ట్ర అధ్యక్షులు రమణ అన్నారు. చోడవరం డివిజన్ స్థాయి భవన నిర్మాణ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం చోడవరం లో సమావేశం నిర్వహించారు. ఎ ఐ టి సి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు కోన లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్మికులు లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని సంక్షేమ బోర్డు ద్వారా వారిని ఆదుకోవాలని కోరారు. పెండింగ్లో , ఉన్న కాన్పు, వివాహ, సహజమరణం సంబంధించిన ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. గ్రామస్థాయిలో సంఘాలను బలోబెతం చేసేందుకు ఏ ఐ టి యు సి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.
రూరల్ అధ్యక్షులు కొనా లక్ష్మణ్ మాట్లాడుతూ సంఘాల్లో ఉన్న కార్మికులకు పథకాల పై పూర్తి అవగాహన కల్పించాలని, కార్మిక కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, కార్మిక కార్యాలయాలలో సిబ్బందిని పెంచాలని కోరారు.
డివిజన్ కార్యదర్శి కొసర తాతారావు మాట్లాడుతూ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు గతంలో మాదిరిగానే పథకాలు అందజేయాలని కోరారు. సంక్షేమ బోర్డు ఏర్పడి పది సంవత్సరాలు అయినా కార్మికులకు కార్మికులకు అవగాహన పరచక పోవడం బాధాకరమని అన్నారు. ఈ పథకాలపై గ్రామస్థాయిలో సంఘాలు అవగాహన కల్పించి ప్రతి కార్మికుడికీ పథకాలు అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడుగుల, చోడవరం, కే కోటపాడు, దేవరపల్లి, బుచ్చయ్య పేట, రావికమతం, సబ్బవరం, చీడికాడ మండల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు
చాలా సంతోషం సార్ మీరు ప్రచురించిన వార్త మా సంఘ సభ్యులకు ఎంతగానో ఆనందం వేసింది ఎందుకంటే ఏ స్థాయి నాయకులు అయినప్పటికీ తమ చేస్తున్నటువంటి పనులు ప్రచారం కాకపోతే వాటికి విలువ లేనట్టే
ఈరోజు చరిత్ర చూస్తున్న చరిత్ర చెప్పుకుంటున్న ఆనాటి మీలాంటి మీడియాను ఎంతోమంది ఆనాటి నాయకుల వద్ద నుండి విషయాలను తీసుకొని ప్రచారం చేయబడిన ఈ రోజు చరిత్రలో చెప్పుకుంటున్నాం ధన్యవాదాలు సార్ థాంక్యూ మీ ఎమ్మెల్యే సోషల్ మీడియా
సర్ మీ లాంటి వాళ్ళ కోసమే ఈ వెబ్సైట్. మీ సమస్యలకు సంబంధించిన ఏ వార్త ఇచ్చిన ప్రముఖంగా ప్రచురించిన బాధ్యత నాది. ఇది మీ వెబ్సైట్ సార్.