
అనారోగ్యంతో బాధపడుతున్న గువ్వల కనకారావు అని భవన నిర్మాణ కార్మికుల కి బాల గణపతి భవన నిర్మాణ కార్మిక సంఘం సోమవారం ఆర్థిక సాయం చేసింది. గువ్వల కనకారావు కూడా ఇదే కార్మిక సంఘానికి చెందిన సభ్యుడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురవ్వడంతో భవన నిర్మాణ పనులకు వెళ్ళలేక పోతున్నారు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆయనకు ఆర్థిక సహాయం అందించింది. కార్మిక సంఘం
అధ్యక్షులు పెమే బాబ్జి ఉపాధ్యక్షులు సింహాచలం, నాయుడు కార్యదర్శి గువా బాలాజీ, కోశాధికారి గుమ్మాల అమ్మ తల్లి, సంఘ సభ్యులు అనపర్తి విష్ణు వరద జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు ప్రభుత్వం నెలకు మూడు వేల చొప్పున సాయం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ధన్యవాదాలు సార్