ఈ చిరుతకు అమ్మ ఆవే

Spread the love

చిరుత, ఆవు బద్ధ శత్రువులు. చిరుతను చూస్తే ఆ ఆవు తన ప్రాణాలను కాపాడుకోవాలని… ఆవును చూస్తే చిరుత దాన్ని చంపేయాలని భావిస్తూ ఉంటాయి. ఇది ఎవరైనా చెప్పే మాటలు. కానీ ఆ రెండూ స్నేహంగా ఉండటం అనేది నమ్మలేని విషయం. అస్సాంలో జ‌రిగిన సంఘ‌ట‌న చూస్తే నమ్మాల్సిందే. ఆవు, చిరుత కలిసి ఒకే చోట ఉంటున్నాయి. ఇవి ఎప్ప‌టి నుంచో స్నేహంగా ఉంటున్నాయి. కానీ ఈ ఆవును కొత్తగా కొనుక్కున్న యజమానికి ఈ విషయం తెలియదు. ఆవును కొన్న తర్వాత ప్రతి రోజూ రాత్రి పూట కుక్కలు అరుస్తూ ఉండేవి. అసలు కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి అన్న విషయం తెలుసుకోవ‌డం కోసం ఆవు ఉన్న ప్రదేశం లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకరోజు ఆ సిసి ఫుటేజ్ ను పరిశీలిస్తే రాత్రిపూట చిరుత వచ్చి ఆవుకి సమీపంలోని కూర్చోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ రెండు ఎప్పటినుంచి స్నేహంగా ఉంటుందన్న విషయాన్ని ఆవుకు చెందిన పాత యజమానిని అడిగి తెలుసుకున్నాడు. అసలు ఎందుకలా ఈ రెండూ స్నేహం గా ఉంటున్న‌ విషయాన్ని ఆయన వివరించారట. చిరుత పుట్టిన 20 రోజుల్లో తన తల్లి చనిపోయింది. అప్పటినుంచి ఆ చిరుత‌కు ఆవే పాలిచ్చేది. చిరుత కాస్త పెరిగిన తర్వాత ఆవును వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో పూర్తిస్థాయిలో పెరిగిన చిరుత ఆ తర్వాత నుంచి ప్రతిరోజు రాత్రి పూట ఆవు దగ్గరకు వచ్చి తనతో గడుపుతూ ఉండేది. ఇప్పటికీ ఆవుని చిరుత తన తల్లిగా భావిస్తూ ఉంటుంది అని ఆయన తెలిపారు.

Recommended For You

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *