ఘ‌నంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

Spread the love

విశాఖ ఏజెన్సీలోని సీఐటీయూ ఆవిర్భావ దినోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. పాడేరు జిసిసి వద్ద పాతాకవిష్కరణ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై సీఐటీయూ రాజీలేని పోరాటం చేస్తున్నదని చెప్పారు. 51 ఏళ్లలో అనేక పోరాటాలు చేసింద‌ని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నదని ఆయ‌న పేర్కొన్నారు. కరోనా కాలంలో ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడుతుంటే,పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తుందని విమ‌ర్శించారు. ఆదానీ, అంబానీల ఆస్తులు ఆకాశాన్ని అంటుతున్నాయని, కార్మికులు వేతనాలు మాత్రం పెరగటం లేదని, అందరికీ ఉచితం గా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్ లను, 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఈ స‌ద‌ర్భంగా ఆయ‌న డిమాండ్ చేశార‌. కరోనా కాలంలో పేద కుటుంబాలకు నెలకు రూ.7500 ఇవ్వాలని , ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్,గౌరి నాయుడు, శ్రీను ,దేముడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *