సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా గంట్ల శ్రీనుబాబు

Spread the love


ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం..

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి…వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కు అపురూపమైన గౌరవం దక్కింది.. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం.. భక్తకోటి ఇల వేల్పు ఐన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి నిత్య భక్తుడు గా ఉన్న శ్రీనుబాబు కి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది..ఈ మేరకు సింహాచలం…సింహాద్రి నాధుడు దేవస్థానం కు ప్రత్యేక
ఆహ్వానితులుగా నియమించడం జరిగింది..ఈ మేరకు ప్రభుత్వం తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది, ఇందుకు సంబందించిన జీవో ను విడుదల చేసింది.., ,, ఇప్పటివరకు సింహాచలం దేవస్థానం చందనోత్సవ కమిటీ సభ్యులుగా,,శ్రీనుబాబు పలుమార్లు సేవలు అందించారు..ఇక అప్పన్న సోదరి శ్రీ పైడితల్లమ్మ ఉత్సవ కమిటీ సభ్యునిగా..మరో సోదరి శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ గౌరవ అధ్యక్షులుగా.. శ్రీనుబాబు సేవలందిస్తూ వస్తున్నారు.,అంతే కాకుండా సింహాచలం దేవస్థానం భక్తుడు గా..దాతగా తన వంతు విరాళాలు పలు సందర్భాల్లో అందజేస్తూ వచ్చారు..అన్న దానం పధకంకి 5 లక్షల రూపాయలు..
బంగారు సంపెంగలు పథకంకి…స్వర్ణ తులసీదళాల పథకానికి శ్రీనుబాబు తన వంతు సుమారు 4.48 లక్షలు విరాళం అందజేశారు..స్వామి వారి స్వర్ణ అలంకరణ కోసం 27 కేజీ ల ఇత్తడి కవచము అందచేశారు..జర్నలిస్ట్ సంఘం నేతగా ఉన్న శ్రీనుబాబుకు ఈ పదవి కేటాయించటం పట్ల,,పలువురు హర్షము కేటాయించారు..తన సేవలు గుర్తించి ఈ పదవి ని కేటాయించిన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి..రాజ్య సభ సభ్యులు విజయ్ సాయిరెడ్డి..మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు..ఎంపీలు..శాసన సభ్యులు..ఇతర నాయకులు కు శ్రీనుబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు….

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *