భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Spread the love

ఏఐటియుసి విన‌తి


భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాల‌ని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ అధ్యక్షులు కోన లక్ష్మణ ఒక్కప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇసుక కొరత, సంపూర్ణ లాక్ డౌన్ వ‌ల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఏడాది పాటు పనులు లేక చాలా అవస్థలు పడుతున్నారని గుర్తుచేశారు .ఈ నేపథ్యంలో రెండో దశ కరోనా వారి బతుకుల్ని మరింత ఛిద్రం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే వారికి పనులు దొరుకుతున్నాయని అనుకుంటున్న త‌రుణంలో తాజాగా విధించిన‌ కర్ఫ్యూ వారి పాలిట శాపంగా మారిందని తెలిపారు. కరోనా కట్టడి లో కర్ఫ్యూ వాంఛనీయమే కానీ రెక్కాడితే గాని డొక్కాడని పేద కార్మికులు కుటుంబాల జీవనానికి ప్రత్యామ్నాయ సహాయ సహకారాలు అందించవలసిన ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయకపోవడంలో నిర్మాణ కార్మికులు రంగంకార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. క‌ర్య్ఫూ మూలంగా ఉదయం 6 గంటల నుంచి 12గంటల వరకు పనులు చేసుకోవడానికి అవకాశం ఇస్తే వాళ్లకు సగం కూలి డబ్బులు మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. ఈ తరుణంలో వారికి నిబంధనలు అనుసరిస్తూ క‌ర్య్ఫూ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. భ‌వ‌న నిర్మాణ కార్మికులను కార్మికుల వెతలను దృష్టిలో పెట్టుకొని రెండు గంటల వరకు పని చేసుకునేలా అనుమతించాలని, మూడు మాసాల పాటు ప్రతి కుటుంబానికీ ఉచితంగా రేషన్, రూ.7500 భృతి ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *