ఘ‌నంగా కార్మిక దినోత్స‌వం

Spread the love

ప్ర‌పంచ కార్మిక దినోత్స‌వం మేడేను జిల్లాలో వాడ‌వాడ‌లా ఘ‌నంగా నిర్వ‌హించారు. విశాఖ‌లో అన్ని కార్మిక కార్యాల‌యాల వ‌ద్ద ప‌తాకాల‌ ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రిపారు. కార్మికుల ప‌ట్ల ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న వ్య‌తిరేఖ వైఖ‌రిని తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు కార్మిక నేత‌లు. పాడేరు మండలం లో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తొమ్మిది చోట్ల ఆవిష్కరణలు జరిగాయి మినుములూరు లో సుందరరావు, జిల్లా ఆస్పత్రి వద్ద పుణ్యవతి, గిరిజన సహకార సంస్థ(జిసిసి)వద్ద ఆర్.శంకరరావు, పంచాయతీ వద్ద కె.అర్జున్ , ముఠా యూనియన్ యు.రాజు, ఆటో యూనియన్ సంజీవ్, రవి, అంగన్వాడీలు యూనియన్ వి.భాగ్యలక్ష్మి, సంత బయలులో పావని, బొక్కలు గ్రామాల్లో చిట్టిబాబు కార్మికుల పతాక ఆవిష్కరణలు గావించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వివిధ చోట్ల ఈ పతాకాల‌ను ఎగురువేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్ రావు మాట్లాడుతూ సంవత్సర కాలంగా కరోనా కాటేస్తున్నా కార్మికులు, రైతులు దేశ అభివృద్ధి కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేశారని చెప్పారు. ఈ కాలంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొచ్చిందని కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడలుగా మార్చిందని ఇవి పారిశ్రామిక వేత్తలకు లాభం చేకూర్చే విధంగా చట్టంలో మార్పులు చేశారని రైతాంగం నష్టం కలిగించే మూడు వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చారని చెప్పారు. కార్మికులు, రైతులు తమపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడికి నిరసనగా అనేక పోరాటాలు చేశారని అయినా బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. దేశ సంపదను అంబానీ, ఆదానీల‌కు దోచి పెడుతున్నారని, ప్రజల సంపదైన‌ ప్రభుత్వ రంగాన్ని మొత్తం అమ్మేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా రెండవ దశ చాలా వేగంగా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నా… బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎన్నికలు, కుంభమేళా లు నిర్వ‌హించి కరోనా పెరుగుదలకు కారణం అయిందని విమ‌ర్శించారు. బిజెపి అధికారంలోకొస్తే భారత్ వెలిగిపోతోందని అన్నారని ఈరోజు స్మశానంలో మంటల్లో భారత్ పెరుగుతోందని.. మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కరోనా వ్యాధి ఎక్కువై ఆక్సిజన్ కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పారు. అందరికీ ఉచిత టీకా వేయాల్సి ఉండగా నేడు బిజెపి ప్రభుత్వం 3 ధరలు నిర్ణయించిందని, గత 70 సంవత్సరాల కాలంలో అందరికీ టికా ఉచితంగా వేస్తే నేడు డబ్బులు ఇచ్చి కొనుక్కోమని మోడీ చెబుతున్నారని అన్నారు. ఒకవైపు దేశ భక్తి పేరుతో దేశద్రోహం పనులకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని భవిష్యత్ తరాల కోసం మనం అందరం ఐక్యంగా పోరాటాలు చేయాలని మేడే స్ఫూర్తి కొనసాగించాలని అన్నారు. ఈ పతాక ఆవిష్కరణ సిఐటియు నాయకులు గౌరి నాయుడు, అంగన్‌వాడీ అంబికా, మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ కార్యదర్శి ఎస్ నాగరాజు, ముఠా వర్కర్స్ యూనియన్ సూరిబాబు, పంచాయితీ కార్మికుల సంఘం అధ్యక్షులు కె.అప్పారావు, రాజా, జి సి సి కళాశాల యూనియన్ ప్రెసిడెంట్ కుమార్, జిల్లా ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు ముత్యాలమ్మ,
ఆటో యూనియన్ నాయకులు సజీవి రవి, గిరిజన సంఘం నాయకులు చిట్టి బాబు ప్రసాద్, కాఫీ కార్మిక సంఘం నాయకులు కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *