వాక్సిన్ వేసుకున్న అర‌కు ఎంపీ

Spread the love

విశాఖపట్నం జిల్లా ఫోర్త్ టౌన్ పరిధిలో ఉన్న జిల్లా కంటి హస్పిటల్ లో గొడ్డేటి మాధవి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ముందుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి వైద్యుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకొని,
కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ప్రజలలో ఉన్న అపోహలు పోగొట్టడానికి బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు.కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకు న్నంతరము సురక్షితంగా ఉన్నానని మీడియాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ విధిగా మాస్క్ ధరించి రద్దీగా ఉండే ప్రదేశాలలో భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కంటి ఆసుపత్రి సూపర్డెంట్ వి.రాజేశ్వరరావు
గారు.డాక్టర్ సుమాంజలి, హెల్త్ ఎడ్యుకేటర్ చమండేశ్వరి, నర్సు యమ్.సుహాసిని గారు తదితరులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *