ఉక్కు బందుకు భారీ మద్దతు

Spread the love

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు పేరుతో శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ కు భారీ మద్దతు లభిస్తోంది. అటు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నుంచి ఇతర విపక్షాలు జనసేన, సిపిఎం, సిపిఐ , కాంగ్రెస్ నుంచి భారీ మద్దతు లభించింది. శుక్రవారం ఉదయం నుంచే బంద్ ప్రభావం రాష్ట్రంలో కనిపించింది. విశాఖ ఏజెన్సీలోని ప్రధాన మండల కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచే బంద్ పాటించడం ప్రారంభించారు. పాడేరు, ముంచంగిపుట్టు, పెదబయలు, అరకు వంటి ప్రాంతాల్లో మోటార్ బైక్ లను కూడా తిరిగి ఇవ్వకుండా అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరూ బంద్ కు మద్దతు ఇవ్వాలని మన హక్కును మనం కాపాడుకోవాలి నినదిస్తూ సిపిఐ, సిపిఎం ,వైయస్సార్ సిపి , టిడిపి నాయకులు కోరారు.

పెదబయలు మండల వైస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు వి.ఆనందరావు, మండల కన్వీనర్ కొర్రకనకారాజు, మజ్జి చంద్రబాబు, సీకరి సర్పంచ్ జి.కృష్ణరావు, కూడా లక్ష్మణరావు, కూడా ఆనందరావు, లంక సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *