ఎన్నికల కమిషనర్ కు మతి భ్రమించింది

Spread the love


మాజీ మంత్రి దాడి విమర్శ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మతి భ్రమించిందని మాజీమంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. సోమవారం స్ధానిక రింగ్ రోడ్డు లో ని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూహైకోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధానపరమైన ఎట్టి ఉత్తర్వులు జారీ చేయకుండా నియంత్రించవలసినదిగా గౌరవ హైకోర్టు వారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా రాజకీయ ప్రలోభాలకు లొంగిపోయి ప్రతిరోజూ అడ్డదిడ్డమైన ఉత్తర్వులు జారి చేస్తున్నారు అని ఆరోపించారు. వాలంటీర్ ల యొక్క ఫోన్లు స్వాధీనం చేసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు ఇవ్వడం చూస్తే కమిషనర్ కు మతి భ్రమించిందా అనే అనుమానం కలుగుతోంది అని 2,60,000 మంది వాలంటీర్ లను దొంగలుగా,దోపిడిదారులుగా గుర్తించి వాళ్లపై నిఘా పెట్టి వాళ్ళ ఫోన్లు లాక్కోవడం చట్టబద్ధమైన చర్యేనా అని అన్నారు. మరో రెండు రోజులు పోతే వలంటీర్లకు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఓటు వేసే హక్కునుకూడా తొలగించేలా వున్నారు అని ఎద్దేవాచేశారు. వారిఫోన్లు లేకపోతే బయోమెట్రిక్ విధానంలో ప్రజలకు అందే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి అని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదని కేవలం గౌరవ భృతి తీసుకుని ప్రజా సేవ చేస్తున్నారని జాతీయ స్థాయి సంస్థలన్నీ అభినందిస్తున్నాయి.ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు వాలంటీర్ లకు వర్తించవనే ఇంగిత జ్ఞానం కూడా కమిషన్ కు లేదా అని దుయ్యబట్టారు. ఓటరు స్లిప్పులు పంచోద్దని వారిపై ఆంక్షలు విధించారు. రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవే ఆంక్షలు విధించవొచ్చుఅని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు న్యావిరుద్ధమైన ఉత్తర్వులు ను జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ లను ఎన్నికల కార్యక్రమాన్ని సజావుగా చేసుకోకుండా వారిని హింసిస్తున్నారని ఆరోపించారు.ఎంపీ టిసి ,జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి ఎన్నికల కమిషన్ ఎన్నికల ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తానిచ్చిన సర్టిఫికెట్లపై తానే విచారణ జరిపించడానికి పూనుకోవడం చూస్తే ఇతను ఎన్నికల కమిషనరా లేక రాజకీయ రాబందా అనిపిస్తోంది అని అన్నారు. వీరిని ముందుపెట్టి తెరవెనుక నుండి నడిపిస్తున్న చంద్రబాబుగారి వైఖరి మారలేదు అని విమర్శించారు.ఎన్టీఆర్,.రాజశేఖర రెడ్డి హయాంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి 55 శాతం నుండి 65 శాతం వరకు మాత్రమే సీట్లు వచ్చాయి. ఈ70 ఏళ్ల చరిత్రలో సర్పంచ్ ఎన్నికల లో 80 శాతాన్ని మించి గెలుపొందిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. ఇది చరిత్రాత్మక విజయం, చివరికి తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో కూడా ప్రజలు చంద్రబాబు కు ఊహించని చావుదెబ్బ కొట్టారు అని ఇప్పటికైనా కుయుక్తులతో రాజకీయం చేయకుండా తన పార్టీని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లో చంద్రబాబు రాజకీయం చేస్తే మంచిది అని లేకపోతే రాష్ట్రంలో మొన్న తమకు వచ్చిన 23 సీట్లు కూడా పోవడమే కాకుండా కుప్పంలో తాను కూడా ఓడిపోవడం ఖాయం. అని మాజీమంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *