బీజేపీలోకి ‘మెట్రో శ్రీధర్’

Spread the love

ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ బీజేపీలో చేరుతున్నారని కేరళ రాష్ట్ర శాఖ గురువారం ప్రకటించింది. ఈ నెల 21న రాష్ట్రంలో బీజేపీ ‘విజయ యాత్ర’ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరుతారని కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, బీజేపీ ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగానే ఉన్నానని ఆయన గతంలో నిర్మొహమాటంగా ప్రకటించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *