ఎన్నిక‌లు య‌థాత‌థం

Spread the love

సుప్రీం కోర్టులోనూ ఏపీ ప్ర‌భుత్వానికి చుక్కెదురు
పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టేసిన అత్యున్న‌త ధ‌ర్మాస‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు య‌థావిధిగానే జ‌ర‌గ‌నున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించిన ఏపీ ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది. ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాలు చేస్తూ సుప్రీంకోర్టులో సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది. జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్‌, జ‌స్టిస్ హృషీకేశ‌రాయ్‌లతో కూడిన బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముకుల్ రోహ‌త్గి వాద‌న‌లు వినిపంచారు. వ్యాకినేష‌న్ కోసం ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని రోహ‌త్గి కోర్టును కోరారు. భ‌ద్ర‌తా సిబ్బందంతా వ్యాక్సినేష‌న్ వేసే ప‌నుల్లో బిజీగా ఉన్న నేప‌థ్యంలో హైకోర్టు ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు ఇచ్చిన అనుమ‌తిని ర‌ద్దు చేయాల‌ని కోరారు. ఈ వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఎన్నిక‌లు వాయిదా వేయ‌డం త‌గ‌ద‌ని చెప్పింది. ఎన్నిక‌లు వాయిదా వేసుకుంటూ వెళ్ల‌డం సాధ్యం కాద‌ని జ‌స్టిస్ కిష‌న్ కౌల్ అన్నారు. రోహ‌త్గి వాద‌న‌లు విన్న త‌ర్వాత ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌పై దురుద్దేశాలు ఆపాదిస్తున్నార‌ని ఆపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఉద్యోగ సంఘాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాము ఎన్నికలకు వ్యతిరేకం కాదని, కేవలం వాయిదా కోరుతున్నామని ఉద్యోగుల త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *