ఏ వ్యాపారం చేసి రూ.1500 కోట్లు సంపాదించారు?

Spread the love

దాడి వీర‌భ‌ద్ర‌రావు అక్ర‌మాస్తుల‌పై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, సీబీఐ కార్యాల‌యాల్లో ఫిర్యాదు
స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని జై అన‌కాప‌ల్లి సేన అధినేత కొణ‌తాల సీతారామ్ డిమాండ్


మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు సంపాదించిన రూ. 1500 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సీబీఐ కార్యాలయాల్లో బుధవారం జై అనకాపల్లి సేన అధ్వ‌ర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కొణతాల సీతారాం తెలిపారు. గురువారం స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉండటానికి సొంతిల్లు లేని పరిస్థితుల్లో పొట్ట చేత్తో పట్టుకొని గవరపాలెం వచ్చిన దాడి వీరభద్రరావు ఎఎంఏ ఎల్ కళాశాలలో కేవలం రూ.150 రూపాయల జీతంతో జీవితం ప్రారంభించార‌ని, టీడీపీలో చేరి 20 ఏళ్ళు అనకాపల్లి ఎమ్మెల్యే గా, 6ఏళ్లు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సుమారు రూ.1500 కోట్లు ఆస్తులను సంపాదించార‌ని ఆరోపించారు. దాడి వీర‌భ‌ద్ర‌రావు ఆస్తులు ఇక్క‌డే కాకుండా విదేశాల్లో కూడా ఉన్న‌ట్టు త‌న వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులను కూడబెట్టారో విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. దాడి కుమారుడు రౌడి షీటర్ దాడి జయవీర్ అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ తమ కార్యకళాపాలకు ఎవరు అడ్డొచ్చిన వారి అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. తాము అలాంటి బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయడంలో విఫలమైందని, అందుకే ఢిల్లీ గడప తొక్కి అన్యాయంపై పోరాటాన్ని కొనసాగిస్తున్నామని సీతారాం తెలిపారు. అవినీతి అక్రమాలపై జై అనకాపల్లి సేన పోరాటాలను కొనసాగిస్తూ ప్రజల పక్షాన నిలబడుతుందని కొణతాల సీతారాం స్పష్టం చేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *