తాడి త‌ర‌లింపున‌కు రంగం సిద్ధం

Spread the love

కోవిడ్ వ‌ల్లే వాయిదా ప‌డింది…. లేకుంటే పంచ గ్రామాల స‌మ‌స్యను ప‌రిష్క‌రించేవాళ్లం
తాను, జిల్లా మంత్రి ప‌ట్టించుకోక‌పోయినా సీఎం జ‌గ‌న్‌కు దీనిపై ప్ర‌త్యేక అవ‌గాహ‌న ఉంది
ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతిని పూర్తి చేస్తాం
మీMLA.in వెబ్ పోర్ట‌ల్ తో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్‌

చిన్న వ‌య‌సులోనే పెద్ద బాధ్య‌త‌లు త‌ల‌నెత్తుకున్న వ్య‌క్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్‌. ఆయ‌న డిగ్రీ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న‌ప్పుడు పెందుర్తి మండ‌లంలో రాంపురం గ్రామానికి సర్పంచ్‌గా పోటీ చేశారు. అప్ప‌టికే ఆ కుటుంబానికి సేవా గుణం క‌లిగినది కావ‌డంతో గ్రామ‌స్తులంతా ఆయ‌న్ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యాక గ్రామ‌స్తులు ఆయ‌న‌పై ఉంచిన న‌మ్మకాన్ని ఒమ్ము చేయ‌లేదు. ఆ స‌మ‌యంలో అంటే 2006లో ఇందిర‌మ్మ రెండో ద‌శ ఇళ్లు ఇచ్చేవారు. ఆ స‌మ‌యంలో ఒక్కో ఇంటికి రూ.24 వేలు ఇచ్చేవారు. మ‌రుగుదొడ్డి అద‌నం…ఈ త‌రుణంలో ప్ర‌భుత్వం ఇచ్చే డ‌బ్బులతో ఇంటి పునాదులు కూడా నిర్మించ‌డం క‌ష్ట‌మ‌ని అదీప్ భావించారు.
నా ఎదుగుద‌ల‌కు టీడీపీయే కార‌ణం
ఆ స‌మ‌యంలో కొత్త ఆలోచ‌న చేశారు. ఎవ‌రికైతే ఇళ్లు వ‌చ్చాయో వారంతా వారి ఇళ్ల‌ను వాల్లే నిర్మించుకోవాలి. అలా ఆ ఇంటి నిర్మాణంలో పాల్గొన్నందుకుగానూ ఈయ‌నే ఇంటి య‌జ‌మానుల‌కు కూలి ఇచ్చేవారు. ఇలా అంద‌రికీ ఇంటికి అవ‌స‌ర‌మైన సిమెంట్, ఇనుము, ఇటుక‌లు ఇలా…అన్నీ స‌మ‌కూరుస్తూ కూలి డ‌బ్బులు కూడా చెల్లించి వాళ్లు ఇల్ల నిర్మాణానికి అదీప్ రాజ్‌స‌హ‌క‌రించారు. ఇలా చేయ‌డాన్ని స్థానికి టీడీపీ నాయ‌కులు వ్య‌తిరేకించారు. కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో అదీప్ తొలిసారిగా మంత్రిస్థాయి నాయ‌కుల‌ను క‌లిశారు. అనంత‌రం జ‌గ‌న్ ద్వారా సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డిని, అప్ప‌టి గృహ‌నిర్మాణ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కొణ‌తాల రామకృష్ణ వంటి వారంద‌రినీ క‌ల‌సి స‌మ‌స్య‌ను వివ‌రించారు. అంతా సానుకూలంగా స్పందించి అదీప్ చేసే పనిని ప్రోత్స‌హించారు. ప‌ట్టుద‌ల‌తో చేసిన ఈ ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.
జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడిగా అదీప్‌
ఆ స‌మ‌యంలో అదీప్ రాజ్‌ను విశాఖ జిల్లా కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు. జిల్లా అంత‌టా ఈయన పేరు అప్ప‌ట్లో మారుమోగింది. ఆ త‌ర్వాత ప‌రిణామాలు, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణం, వైఎస్సార్ సీపీ ఆవిర్భావం, పార్టీలో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న కొణతాల రామ‌కృష్ణ‌, గండిబాబ్జి వంటి నేత‌లంతా పార్టీని వీడి వెళ్లిపోయారు. ఆ స‌మ‌యంలో పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద దిక్కు అనేవారు లేకుండా పోయారు. కార్య‌క‌ర్త‌లంతా అయోమ‌యంలో ప‌డ్డారు. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మేన‌ని అంతా అనుకుంటున్న త‌రుణంలో అదీప్ రాజ్‌కు నియోజ‌క‌వ‌ర్గ స‌మన్వ‌య క‌ర్త‌గా జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.
ఎన్నో అవ‌మానాలు, చీత్కారాలు
అదీప్ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు కానీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు అనుకూల ప‌రిస్థితులు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఎక్క‌డో యువ‌త త‌ప్ప అదీప్ నాయ‌క‌త్వాన్ని స్వాగతించిన కార్య‌క‌ర్త‌లు లేరు. ఎక్క‌డ‌కెళ్లినా అందులో సీనియ‌ర్ నాయ‌కులు కొంద‌రైతే నేరుగా నువ్వు మాకు స‌మ‌న్వ‌య క‌ర్త ఏమిటి?. నీ వెనుక మేమంతా తిర‌గ‌డం ఏమిటి? అన్న‌ట్టు అవ‌హేళ‌న‌గా మాట్లాడారు. ఈ పిల్లోడా ఎమ్మెల్యేగా గెలిచేదంటూ ఎక్క‌డ‌కెళ్లినా అలా అన్న‌వారే త‌ప్ప స్వాగతించిన వారు లేరు. అయినా ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. ఎన్న అవ‌మానాలు ఎదురైనా, నాయ‌క‌త్వం అంతా చీత్క‌రించినా జ‌గ‌న్ కు ఇచ్చిన మాట ప్ర‌కారం ముందుకు వెళ్లిపోయారు. పెందుర్తిలో పార్టీ నిర్మాణం కోసం నిరంత‌రం శ్ర‌మించారు.
స‌మ‌స్య ఉన్న చోట అదీప్ ఉండేవారు
పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ అదీప్ వాలిపోయేవారు. అందులో టీడీపీలో ఉన్న బండారు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి సీనియ‌ర్ రాజ‌కీయ‌నాయ‌కుడు. ఆయ‌న్ను ఎదుర్కోవాలంటే అంత ఆషామాషి కాదు. అయినా ఆయ‌న‌తో పోరాడారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండేవారు. ఈ క‌ష్టాన్ని వైఎస్సార్‌సీపీ అధిష్టానం గుర్తించింది. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డే నేరుగా పెందుర్తిని అదీప్ చూసుకుంటార‌నే స్థాయికి వ‌చ్చారు. అలా ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
ఆ నోళ్లు మూసుకున్నాయి
పిల్లోడు…బుడ్డోడు …ఈయ‌న ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఏమిట‌ని అవ‌హేళ‌న చేసిన వాళ్లంతా గ‌మ్మునుండిపోవాల్సి వ‌చ్చింది. ఏ నోటితో ఆ మాట‌ల‌న్నారో అదే నోటితో శెభాష్ అదీప్ అనాల్సి వ‌చ్చింది. ఎందుకంటే ఆయ‌న 28వేల‌కు పైగా మెజార్టీ వ‌చ్చింది. ఆ మెజార్టీ చూసిన‌వాళ్లంతా నోరెళ్ల‌బెట్టారు.

కోవిడ్ వ‌ల్లే ఆల‌స్య‌మైంది
రెండు ద‌శాబ్దాలుగా ప‌రిష్కారం కానిది పంచ‌గ్రామాల స‌మ‌స్య‌. ప‌ద‌వీ కాలం నెల రోజుల్లో ముగుస్తుంద‌నుకునే స‌మ‌యంలో టీడీపీ ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఓ జీవో విడుద‌ల చేసింది. 200 చ‌.అ. విస్తీర్ణం ఉన్న వారికి ఉచితం ప‌ట్టాలు ఇవ్వాల‌ని, అంత‌కు మించి ఉంటే 1998 ధ‌ర‌లు ప్ర‌కారం చెల్లించేలా నిబంధ‌న‌లు విధించారు. కానీ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండ‌డం వ‌ల్ల ఈ జీవో చెల్ల‌లేదు. దీంతో ఆ స‌మ‌స్య ఇప్ప‌టికీ ప‌రిష్కారం కాలేదు.
పంచ‌గ్రామాల స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌కుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌నేమో ః అదీప్‌
త‌న‌కు పంచ‌గ్రామాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించినా లేక‌పోయినా స‌రే సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మాత్రం ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ ఉంద‌ని అదీప్ మీఎమ్మెల్యేవెబ్‌పోర్ట‌ల్ జ‌రిపిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ అని అద నెర‌వేర్చ‌కుంటే తాను కూడా ఎన్న‌క‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉందో లేదో కూడా తెలియ‌ద‌ని అదీప్ చెప్పారు. ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం చాలా చిత్త‌శుద్ధితో ఉంద‌ని తెలిపారు. టీడీపీ కోర్టుల‌ను ఒప్పించ‌కుండా ప‌దవీ కాలం ముగిసే స‌మ‌యంలో చివ‌రిలో ప‌ట్టాల కోసం కొత్త జీవో తెచ్చార‌ని అందుకే ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని అదీప్ పేర్కొన్నారు.
తాడి గ్రామం త‌ర‌లింపు
పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌రవాడ మండ‌లంలోని తాడి గ్రామ పంచాయ‌తీ పూర్తిగా కాలుష్య కోర‌ల్లో చిక్కుకుపోయింది. ముందు త‌యారీలో భాగంగా చివ‌రిలో ఏర్ప‌డ్డ వ్యర్థాలు భారీ ఎత్తున పేరుకుపోవడంతో అక్క‌డ తాగునీరు కూడా పూర్తిగా క‌లుషిత‌మైపోయింది. ప్ర‌స్తుతం ఏ చేతి బోరు నీరు తోడినా స‌రే అక్క‌డ మంచినీళ్లు కాకుండా పెట్రోలు రంగులో ఉండే నీళ్లే వ‌స్తున్నాయి. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌నుగొంది. ఆ గ్రామాన్ని త‌ర‌లించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. రెండు మూడు నెల‌లోనే తాడి, చిన‌తాడి, తాడి కాల‌నీని అన్ని మౌలిక సదుపాయాలు క‌ల్పించి, న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి ని పూర్తి చేస్తాం
ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్ట్‌ను ఈ సారి పూర్తి చేస్తామ‌ని అదీప్ రాజ్ తెలిపారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉన్న‌ప్పుడు స‌బ్బ‌వ‌రంలో ఈ ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేశారు. త‌ర్వాత అదే ప‌థ‌కానికి చంద్ర‌బాబు చోడ‌వ‌రం మ‌రోసారి శంకుస్థాప‌న చేశారు. ఉత్త‌రాంధ్ర‌కు, సాగు తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్ట్‌ను ఈ సారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తి చేస్తామ‌ని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ చెప్పారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *