ఏడాదికి రూ. వెయ్యి కోట్లు నా టార్గెట్

Spread the love


వ్యాపారుల కోస‌మే రోడ్డు విస్త‌ర‌ణ త‌గ్గింపు-
చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ

చోడ‌వ‌రం రోడ్డును 4 వేస్‌గా విస్త‌రించే ప‌నుల్లో భాగంగా మొద‌ట 120 అడుగులు అనుకున్నా, వ్యాపారులు న‌ష్ట‌పోతార‌న్న ఉద్దేశంతో దాన్ని 100 అడుగుల‌కు త‌గ్గించిన‌ట్టు చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ తెలిపారు. మీMLA.in వెబ్ పోర్ట‌ల్ ప్ర‌త్యేకంగా జ‌రిపిన ఇంట‌ర్వ్యూలో చోడ‌వ‌రం నియోజ‌కవ‌ర్గానికి సంబంధించి ప‌లు విష‌యాల‌ను ఆయ‌న కూలంకుషంగా చ‌ర్చించారు.
తొలిసారి మాడుగుల ఎమ్మెల్యేగా ప‌నిచేసి దాన్నొక మోడ‌ల్‌ నియోజ‌క వ‌ర్గంగా తీర్చిదిద్దామ‌నీ, త‌ర్వాత రెండు ద‌ఫాలు ఓట‌మిని చ‌విచూసినా, ఈ సారి మాత్రం 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌లు త‌న‌పై పెట్టిన విశ్వాసాన్ని ఎక్క‌డా స‌న్న‌గిల్ల‌కుండా రాష్ట్రంలో అత్య‌ధిక నిధులు తెచ్చి ఇక్క‌డ అభివృద్ధి చేస్తున్న‌ట్లు చెప్పారు.
షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని అప్పుల్లో నుంచి గట్టెక్కిస్తున్నాం…పూర్వ‌పు వైభోగాన్ని తెస్తాం
గ‌త టీడీపీ పాల‌నలో షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని పూర్తిగా న‌ష్టాల్లోకి నెట్టేశారు. ఆ ఫ్యాక్ట‌రీ విలువ రూ.50 కోట్ల‌యితే దానికి మించి రూ. 175 కోట్లు అప్పే చేశారని ధ‌ర్మ‌శ్రీ చెప్పారు. షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ పూర్వ‌వైభ‌వం తీసుకురావ‌డం కోసం నిరంత‌రం కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌స‌మ‌యంలో సిఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఫ్యాక్ట‌రీ గురించి కూలంకుషంగా అన్ని స‌మ‌స్య‌ల‌ను విన్నార‌నీ, దానికి త‌గ్గ‌ట్టే ఎన్నిక‌లై గ‌వ‌ర్న‌మెంటు ఏర్ప‌డిన వెంట‌నే రూ. 44 కోట్లు ఫ్యాక్ట‌రీ అప్పు కోసం కేటాయించిన‌ట్లు తెలిపారు. మ‌రో రూ. 32 కోట్లు ఫ్యాక్ట‌రీ కోసం సీఎం కేటాయించార‌ని చెప్పారు. ఇందులో రూ. 20 కోట్లను కో జ‌న‌రేష‌న్‌కి, బాయిల‌ర్ కోసం ఈ నిధుల‌ను కేటాయించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. నిల్వ ఉన్న 4 ల‌క్ష‌ల క్వింటాల పంచదార‌ను విక్ర‌యిస్తే కొంత‌వ‌ర‌కూ మిగిలిన అప్పు తీరే అవ‌కాశం ఉంటుంద‌నీ, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో సుజ‌ల స్ర‌వంతికి కూడా నిధులు కేటాయించామ‌నీ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం కోసం రూ. 59,432 ఏడాది కాలంలో కేటాయిస్తే , ఒక్క చోడ‌వ‌రం నియోజ‌కవ‌ర్గానికి రూ. 497 కోట్లు వ‌చ్చింద‌ని చెప్పారు.

చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ ఇంటర్వ్యూమొద‌టి భాగం ఇది… రెండో భాగం మంగ‌ళ‌వారం


స‌చివాల‌యాల నిర్మాణం 60 శాతం పూర్తి
త‌న నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామ స‌చివాల‌యాల నిర్మాణం 60 శాతం పూర్త‌యింద‌ని , మ‌రో రెండు నెల‌లో మిగిలినవి పూర్త‌వుతాయ‌ని తెలిపారు. నియోజ‌కవ‌ర్గం అభివృద్ధి, సంక్షేమానికి క‌లిపి ఏడాదికి రూ. వెయ్యి కోట్లు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న‌ట్లు ధ‌ర్మ‌శ్రీ చెప్పారు.
లంచం తీసుకునే రోజులు పోయాయి…
బీసీడీ స‌ర్టిఫికేట్ల కోసం ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఎక్క‌డా లంచం తీసుకోవ‌డం లేద‌నీ , అవ‌న్నీ గ‌తంలో ఉన్నా, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అలాంటి వాటికి తావు లేద‌ని తెలిపారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *